'మల్లేశం' కోసం నానీ .. విజయ్ దేవరకొండలను అనుకున్నారట

  • చింతకింది మల్లేశం గురించి విన్నాను
  •  నాని, విజయ్ దేవరకొండ మూడేళ్ల వరకూ బిజీ
  •  ప్రియదర్శితో ముందుకు వెళ్లానన్న దర్శకుడు  
ప్రియదర్శి ప్రధాన పాత్రధారిగా థియేటర్లకు వచ్చిన 'మల్లేశం' సినిమాకి, అన్ని ప్రాంతాల నుంచి మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు రాజ్ ఆర్ ప్రస్తావించారు. చింతకింది మల్లేశం గారి గురించి తెలుసుకున్నాక, ఆయనను కలుసుకుని నా ఆలోచనను చెప్పాను. ఆయన నుంచి అనుమతి తీసుకుని స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నాను.

'మల్లేశం' పాత్రకి నానీగానీ .. విజయ్ దేవరకొండగాని అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేశాను. మరో మూడేళ్ల వరకూ వాళ్ల కాల్షీట్స్ లేవని తెలిసింది. ఆ సమయంలోనే ప్రియదర్శి పేరు వినిపించింది. దాంతో ఆయనతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అంతా సిద్ధం చేసుకున్న తరువాత నేనే దర్శకత్వం చేయడం మంచిదనే భావన వచ్చింది. దాంతో నేనే రంగంలోకి దిగాను .. ఇప్పుడు ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ ఆనందాన్ని కలిగిస్తోంది" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
priyadarshi

More Telugu News